breaking news
Dun and Bradstreet
-
ముంచుకొస్తున్న మాంద్యం..
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత్ ఆర్ధిక మాంద్యం బారిన పడుతుందని తాజా నివేదిక స్ప్టష్టం చేసింది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్‌లో ప్రకటించిన చర్యలు సరఫరా మెరుగునకు ఉపయోగపడినా ప్రజల చేతిలో నగదు లేకుంటే సరుకులు, సేవలకు డిమాండ్ పెద్దగా ఉండబోదని ఆ నివేదిక పేర్కొంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల ఆదాయం, ఉద్యోగాలు కోల్పోడం, వినిమయ కార్యకలాపాలు మందగించడంతో మాంద్యం ముప్పు పొంచిఉందని డన్ అండ్ బ్రాడ్‌స్ర్టీట్ వెల్లడించిన ఎకనమిక్ అబ్జర్వర్ నివేదిక తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్ సమర్థ అమలు, ఇది ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై భారత్‌లో ఆర్ధిక వ్యవస్థ రికవరీ ఆధారపడిఉందని పేర్కొంది. చదవండి : 2.5 కోట్ల ఉద్యోగాలకు కోత లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసేందుకు తీసుకునే సమయం, ఉద్దీపన ప్యాకేజ్ కింద ప్రకటించిన చర్యలను సమర్ధంగా ఎంతకాలం అమలు చేస్తారనేది కీలకమని డన్ అండ్ బ్రాడ్‌స్ర్టీట్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ అరుణ్ సింగ్ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్‌తో పాటు ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించడం, మారటోరియం వ్యవధిని మరో మూడు నెలలు పొడిగించడం వంటివి కొంత ఉపశమనం కలిగిస్తాయని సింగ్ పేర్కొన్నారు. -
వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతం
డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ అంచనా ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.4% వృద్ధిని సాధించగలదని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ తాజాగా అంచనా వేసింది. పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం ఇందుకు సహకరించగలదని ఒక నివేదికలో పేర్కొంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడం, కీలక సంస్కరణలు తీసుకురావడం వంటి అంశాలు సైతం జీడీపీకి జోష్‌నిస్తాయని కంపెనీ సీనియర్ ఆర్థికవేత్త అరుణ్ సింగ్ చెప్పారు. ఇక ఈ ఏడాదికి(2014-15) జీడీపీ వృద్ధి 5.3%గా నమోదు కాగలదని అంచనా వేశారు. సమీప భవిష్యత్‌లో ద్రవ్యోల్బణం తీరు, పారిశ్రామిక పురోగతి, క్షీణిస్తున్న చమురు ధరలు వంటివి వృద్ధికి కీలకంగా నిలవనున్నట్లు నివేదిక పేర్కొంది. ఇంధన సబ్సిడీలను తొలగించడం, సామాజిక మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచడం వంటి వివిధ ప్రభుత్వ విధానాలకుతోడు, ఆర్బీఐ చేపట్టనున్న ఆర్థిక రంగ సంస్కరణలు వృద్ధికి దోహదం చేస్తాయని వివరించింది.