రామ మందిర శంకుస్థాపనకు మోదీకి ఆహ్వానం

Ram Mandir Trust invites Modi to lay foundation stone - Sakshi

పాట్నా: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే మందిరానికి  భూమి పూజ జరగ్గా, త్వరలోనే ఆలయ నిర్మాణ పనులను ప్రారంభం కానున్నాయి.  ఈ నేపథ్యంలో అయోధ్యలో పర్యటించాలని ప్రధాని మోదీకి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లేఖరాసింది. కరోనా వైరస్‌ కారణంగా ఎక్కువ మంది గుమిగూడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ సంధర్భంగా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్‌ దాస్‌ మాట్లాడుతూ, ‘అయోధ్యలో పర్యటించి, రామమందిర నిర్మాణ పనులను ప్రారంభించాల్సిందిగా ప్రధాని మోదీకి లేఖ రాశాం. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎక్కువ మంది గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. రావడం వీలు కాకపోతే వీడియో కాన్ఫిరెన్స్‌ ద్వారా అయిన శంకుస్థాపన చేయాలని కోరాం’ అని తెలిపారు. (2022 నాటికి మందిర్‌ సిద్ధం..)

 ఆలయ నిర్మాణ పనులు శ్రావణ మాసం చివరి రోజు ఆగస్టు 5 న జరగవచ్చని నృత్య గోపాల్ దాస్ తెలిపారు. ఇది హిందూ క్యాలెండర్లో పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది.రామ జన్మ భూమి గ్రౌండ్ లెవలింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని కొన్ని నివేదికల ప్రకారం తెలుస్తున్నాయి.  చెక్కిన రాళ్లను శుభ్రపరిచే పనులను ఇప్పటికే ముమ్మరం చేశారు. ఈ పనిని పూర్తి చేయడానికి రెండు డజన్లకు పైగా స్పెషలిస్ట్ కార్మికులు అయోధ్యకు చేరుకున్నారు. 1990 లో విశ్వ హిందూ పరిషత్ స్థాపించిన వర్క్‌షాప్ లో ఈ రాళ్లను చెక్కారు.అంతకుముందు ఆదివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని రామ జన్మభూమి స్థలాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రామ మందిర్ నిర్మాణం కోసం సీఎం తన వ్యక్తిగత సొమ్మును  రూ .11 లక్షలు విరాళంగా ఇచ్చారు. (ఆకాశాన్నంటే రామ మందిరం)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top