చిన్నారి గొంతు కోసి రక్తం తాగబోయాడు! | psychopath try to cut the child neck and drink blood | Sakshi
Sakshi News home page

చిన్నారి గొంతు కోసి రక్తం తాగబోయాడు!

Jan 17 2017 3:07 AM | Updated on Apr 3 2019 4:24 PM

మూడో తరగతి చదివే ఓ చిన్నారి గొంతుకోసి రక్తం తాగబోయాడో ఉన్మాది. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఆదివారం ఈ దారుణం జరిగింది.

బరంపురం: మూడో తరగతి చదివే ఓ చిన్నారి గొంతుకోసి రక్తం తాగబోయాడో ఉన్మాది. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఆదివారం ఈ దారుణం జరిగింది. ఆస్పత్రిలో ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. గంజాం జిల్లాలోని బడా అర్జాపల్లికిచెందిన యూ బైరాగి(33) ఇంటిదగ్గర్లోనే ఈ చిన్నారి కుటుంబం నివసిస్తోంది. ఆదివారం తొటి పిల్లలతో కలసి ఈ అమ్మాయి సముద్రతీరం వెంట ఆడుకుంటుండగా బైరాగి వచ్చి బ్లేడుతో పాప గొంతుకోసి వెంటనే రక్తంతాగేందుకు ప్రయత్నించాడనిఅర్జీపల్లి ఇన్‌స్పెక్టర్‌ నమిత చెప్పారు.

బైరాగి ముఖంనిండా రక్తపు మరకలు ఉన్నాయని, చూడ్డానికి మానసికరోగిలా కనిపిస్తున్నాడని నమితి చెప్పారు. పారిపోతున్న బైరాగిని గోపాల్‌పూర్‌ పోర్టు వద్ద స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.ఇంతటి దారుణానికి అసలు కారణం తెలియాల్సిఉంది. ప్రస్తుతం చిన్నారిని ఎంకేసీజీ వైద్యవిద్య ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement