
వియత్నాం బయల్దేరిన రాష్ట్రపతి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటనకు వియత్నాం పయనమయ్యారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటనకు వియత్నాం పయనమయ్యారు. ప్రణబ్ ఆదివారం ఇక్కడి నుంచి బయల్దేరివెళ్లారు.
ఈ పర్యటనలో పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపడానికి ఒప్పందం చేసుకుంటారు. రాష్ట్రపతి వెంట పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆరుగురి ఎంపీలు తదితరులు వెళ్లారు.