లాలు కుమారుడిపై జోకు విసిరిన మోదీ | pm modi joked with Lalu Yadav's son Tej Pratap Yadav about imitating Lord Krishna | Sakshi
Sakshi News home page

లాలు కుమారుడిపై జోకు విసిరిన మోదీ

Jan 6 2017 12:43 PM | Updated on Aug 15 2018 2:30 PM

లాలు కుమారుడిపై జోకు విసిరిన మోదీ - Sakshi

లాలు కుమారుడిపై జోకు విసిరిన మోదీ

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చిన్నకుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌(28)పై ప్రధాని నరేంద్రమోదీ జోక్‌ పేల్చారు.

పాట్నా: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చిన్నకుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌(28)పై ప్రధాని నరేంద్రమోదీ జోక్‌ పేల్చారు. అందరూ కలిసి భోజనం చేస్తున్న సందర్భంలో 'అయితే నువ్వు ఇప్పుడు కృష్ణుడివన్నమాట' అని మోదీ అనగానే అక్కడ నవ్వులు విరిసాయి. అదేంటి లాలు కుమారుడిని మోదీ కృష్ణుడు అనడమేమిటని అనుకున్నారా.. మరేంలేదు.. బిహార్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఆదివారం నూతన సంవత్సర వేడుకలను వెరైటీగా జరుపుకొన్నారు. ఆయన కృష్ణుడిలా వస్త్రాధరణ చేసుకొని, పిల్లనగ్రోవి వాయిస్తూ కెమెరా కంటికి చిక్కారు.

చదవండి..(లాలు కుమారుడి స్టైలే వేరు!)


ఇదేమి విచిత్రం అని ప్రశ్నించగా తనకు శ్రీకృష్ణుడి భక్తుడు ఒకరు ఈ దుస్తులు, ఫ్లూట్‌ ఇచ్చారని తేజ్‌ ప్రతాప్‌ చెప్పాడు. అందుకే ఈ దుస్తులు వేసుకుని, ఫ్లూట్‌ వాయించి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నానని చెప్పారు. ఆయన ఫోటో కూడా సోషల్‌ మీడియాలో పరుగులు పెట్టింది. ఈ ఫొటో చూసిన మోదీ ఆ సమయంలో నవ్వుకున్నారేమో.. గురువారం బిహార్‌లో గురు గోవింద్‌ సింగ్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ సీఎం నితీశ్‌, లాలుతో కలిసి భోజనం చేసిన మోదీ ఆ సమయంలో ఈ జోకు పేల్చారు. 'నువ్వు ఇప్పుడు మెల్లగా కృష్ణభగవానుడిగా మారిపోతున్నావన్నమాట' అంటూ తేజ్‌ ను మోదీ అంటు ముసిగా నవ్వారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement