ఇక ‘పిట్‌ స్టాప్‌’ ఉచిత మరమ్మతు సేవలు

PitStop Free Repair Services - Sakshi

ఎటువంటి ఖర్చులేకుండానే ఉచిత మరమ్మతు సేవలు

9 నగరాల్లో అత్యవసర సేవల విభాగంలో పనిచేస్తున్న వారికి మాత్రమే

బెంగళూరు: కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడే ప్రజాజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో డెలివరీ సిబ్బంది, అగ్నిమాపక, పోలీస్, అంబులెన్స్, వైద్యులు, వైద్య సిబ్బంది వంటి అత్యవసర విభాగాల్లో పనిచేసే వ్యక్తులు ఉపయోగించే వాహనాలు మధ్యలో ఆగిపోతే వారికి ఉచిత మరమ్మతు సేవలందించేందుకు గాను పిట్‌ స్టాప్‌ అనే సంస్థ ముందుకొచ్చింది. పిట్‌ స్టాప్‌ ఉచిత మరమ్మతు సేవల్ని పొందేందుకు గాను 626262 1234 నంబర్‌కు ఫోన్‌ గానీ, లేదా www.getpitstop.comను గానీ సంప్రదించవచ్చు. సమాచారం అందుకున్న పిట్‌ స్టాప్‌ సిబ్బంది తమ సంచార వాహనంతో వచ్చి సదరు వాహనాన్ని రిపేరు చేసి వెళ్లిపోతుందని సంస్థ ప్రతినిధులు శనివారం మీడియాకు తెలిపారు. ఈ సేవలు బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె, హైదరాబాద్, చెన్నై, నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్‌ లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని సంస్థ వివరించింది. ఈ సందర్భంగా ఎమర్జెన్సీలో పనిచేస్తున్న వారందరికీ పిట్‌ స్టాప్‌ సంస్థ తరఫున సీఈవో మిహిర్‌ మోహన్‌ సెల్యూట్‌ చేసి అభినందించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top