
భువనేశ్వర్: ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం, వాటి కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అర కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి భోజన సదుపాయాన్ని కల్పిస్తోంది. ‘మీల్ ఫర్ ప్లాస్టిక్’ పేరిట చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార్ పథకంలో చేర్చారు. దీని ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణతోపాటు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు బీఎంసీ కమిషనర్ ప్రేమ్ చంద్ర చౌదరి తెలిపారు.