రజనీ ప్రకటనపై కొనసాగుతున్న ఉత్కంఠ | No political questions please, says Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీ ప్రకటనపై కొనసాగుతున్న ఉత్కంఠ

May 19 2017 2:28 AM | Updated on Sep 5 2017 11:27 AM

రజనీ ప్రకటనపై కొనసాగుతున్న ఉత్కంఠ

రజనీ ప్రకటనపై కొనసాగుతున్న ఉత్కంఠ

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ప్రకటనపై ఉత్కంఠ కొనసాగు తోంది. అభిమానులతో ఈ నెల 15 నుంచి రజనీ సమావేశాలు జరుపుతున్న విషయం తెలిసిందే.

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ప్రకటనపై ఉత్కంఠ కొనసాగు తోంది. అభిమానులతో ఈ నెల 15 నుంచి రజనీ సమావేశాలు జరుపుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రోజూ వేలాదిమంది వచ్చి రజనీని కలుసుకుంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలన్న తమ బలమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో గురువారం సైతం పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ‘మీరు రాజకీయాల్లోకి వస్తారని దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్నాను, నాకు 58 ఏళ్లు, నేను చనిపోయేలోగా ఏదో ఒకటి తేల్చండి’ అంటూ ఒక అభిమాని ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, రాజకీయాలపై ప్రశ్నించవద్దంటూ గురువారం మీడియా నుద్దేశించి రజనీకాంత్‌ పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement