‘నితీష్‌ కోటా వ్యతిరేకి’ | Nitish Kumar is 'anti-reservation', alleges Lalu  | Sakshi
Sakshi News home page

‘నితీష్‌ కోటా వ్యతిరేకి’

Nov 1 2017 5:38 PM | Updated on Nov 1 2017 5:38 PM

Nitish Kumar is 'anti-reservation', alleges Lalu 

సాక్షి,పాట్నా: బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ అన్నారు. దళిత కోటాపై పాలక జేడీ(యూ) నేతలు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా లాలూ సమర్ధించారు. అసెంబ్లీ మాజీ స్పీకర్‌ ఉదయ్‌ నారాయణ్‌ చౌదరి, మాజీ మంత్రి శ్యామ్‌ రజక్‌లు రిజర్వేషన్లపై కేం‍ద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుపట్టారు. ప్రమోషన్లలో కోటాను రద్దు చేశారని, ఎస్‌సీ,ఎస్‌ట్‌ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వీరు ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం కొరవడిందని విమర్శించారు.

జేడీ(యూ) నేతల అభిప్రాయంతో లాలూ ప్రసాద్‌ ఏకీభవించారు. ఉదయ్‌, శ్యామ్‌ రజక్‌లు చెప్పింది నూరు శాతం నిజమని లాలూ సమర్ధించారు. దళితుల కోటాపై భిన్న పార్శ్వాల నుంచి దాడి జరుగుతోందని, దీనిపై జేడీ(యూ) చీఫ్‌ మౌనంగా ఉండటం తనను ఆశ్చర్యానికి లోను చేసిందని లాలూ అన్నారు. నితీష్‌ ఎప్పుడూ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారని తనకు తెలుసునన్నారు. మధ్యనిషేధం లోపభూయిష్టంగా మారిందని లాలూ ధ్వజమెత్తారు. కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో డోర్‌ డెలివరీ చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement