
మంత్రిగారు..మూత్రం ..ఓ చిట్కా!?
మీరూ మీ మూత్రాన్నిమొక్కలకు విరివిగా వాడండి.. .ఆగండాగండి..ఈ మాటలు చెబుతోంది ఎవరో వ్యవసాయ శాస్త్రవేత్తో... ఆయుర్వేద నిపుణులో కాదు సుమా! స్వయంగా కేంద్రమంత్రి మన మూత్రాన్ని ఎరువుగా వాడమని నితిన్ గడ్కరీ ఇలా సెలవిచ్చారు.
న్యూఢిల్లీ: మీకు వివిధ పండ్ల మొక్కల పెంపకం అంటే చాలా యిష్టమా.. అవి ఏపుగా పెరిగి మంచి దిగుబడి రావాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా....అయితే రోజూ మీ మూత్రాన్ని ఒక డబ్బాలో భద్రపరచండి.....అంతే మీ మొక్కలకు కావాల్సినంత యూరియా.. నైట్రోజన్ రెడీ.. తీసుకెళ్లి మీ మొక్కలకు పోయిండి.
ఇక చూసుకోండి...నా రాజా.... మీ తోటలో గుత్తులు గుత్తులుగా బోలెడన్ని కాయలు.. నిజం...నమ్మండి... కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా ఇది నిజం.. .ఒఠ్ఠు.. అపార్థం చేసుకోవద్దు. ఒక్కసారి ఈ చిట్కా మీరు పాటించారంటే ఫలితం మీకే తెలుస్తుంది. ఈ ప్రయోగం నేను చేసి చూశా.. అందుకే మీరూ మీ మూత్రాన్నిమొక్కలకు విరివిగా వాడండి.. .ఆగండాగండి..ఈ మాటలు చెబుతోంది ఏ వ్యవసాయ శాస్త్రవేత్తో... ఆయుర్వేద నిపుణుడో కాదు సుమా! కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా పైవిధంగా సెలవిచ్చారు.
సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'కరువుపై పోరాటం' అనే కార్యక్రమానికి హాజరైన సభికులకు తన యూరిన్ చిట్కాను పాటించమని నితిన్ సూచించారు. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బంగ్లాలోని చెట్లకు కూడా ఇదే వాడమని తోటమాలికి సలహా ఇచ్చిన రహస్యాన్ని వెల్లడించారు గడ్కరీ.
10 జనపథ్లో ఉన్న తన ఇంటి ఆవరణలోని గార్డెన్లో ఈ చిట్కాను పాటించి, ఆశ్చర్యపోయే ఫలితాలను సాధించానన్నారు. ఈ చిట్కాతో తన ఆరెంజ్ తోటలో ఒకటికి రెండింతలు కాయలు కాసాయని చెప్పుకొచ్చారట మంత్రి. దీనికి సంబంధించి ఒక వీడియోను యూ ట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇపుడు ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోందిట. రకరకాల జోక్లు,కామెంట్లతో, ట్వీట్స్తో హంగామా సృష్టిస్తోందట..
అపుడెపుడో మొరార్జీదేశాయ్ మూత్ర వైద్యం గురించి విన్నాం... పంచగవ్య గురించి విన్నాం.. ఈ గడ్కరీ చిట్కా ఏంటిరా బాబూ అనుకుంటున్నారట జనాలు. మరి కొందరయితే ఆయన ఎవరికైనా పండ్లు బహుమతిగా ఇస్తే..దయచేసి ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిందే అంటున్నారట.