రాజస్తాన్‌లో గోరక్షకుల దురాగతం

Muslim man ferrying cows dead in Alwar, police probe vigilantes - Sakshi

ఆల్వార్‌: గోరక్షకులు మరోసారి రెచ్చిపోయారు. రాజస్తాన్‌లో ఆవులను తీసుకెళ్తున్న ఉమర్‌ ఖాన్‌(35) అనే వ్యక్తిని తుపాకీతో కాల్చిచంపారు. అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశారు. భరత్‌పూర్‌ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన ఉమర్‌ మృతదేహాన్ని రామ్‌గఢ్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శనివారం గుర్తించినట్లు డీఎస్పీ అనిల్‌ బెనివాల్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణ సాగుతోందని..మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జైపూర్‌కు పంపినట్లు వెల్లడించారు.

ప్రాథమిక విచారణలో ఉమర్‌ ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్లు తేలిందన్నారు. ఉమర్‌తో పాటు మరో ఇద్దరు శుక్రవారం ఆవులను తరలిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి వీరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై పలు మానవహక్కుల సంఘాలు ఉమర్‌ మృతదేహాన్ని భద్రపరచిన ఆస్పత్రి ముందు ఆందోళన నిర్వహించాయి. స్మగ్లర్లను శిక్షించడానికి చట్టం ఉందనీ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న గోరక్షకులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top