ఆగ్నేయాసియా గేట్‌వేగా మిజోరాం | Mizoram to soon become gateway to South East Asian countries: Narendra Modi | Sakshi
Sakshi News home page

ఆగ్నేయాసియా గేట్‌వేగా మిజోరాం

Dec 17 2017 2:37 AM | Updated on Aug 15 2018 2:32 PM

Mizoram to soon become gateway to South East Asian countries: Narendra Modi - Sakshi

షిల్లాంగ్‌లో గిరిజన తెగల సంప్రదాయ దుస్తుల్లో మోదీ

ఐజ్వాల్‌/షిల్లాంగ్‌: ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు, రవాణా సౌకర్యాల అభివృద్ధికి తమ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగా మయన్మార్‌లోని సిత్వే పోర్టును మిజోరాంతో అనుసంధానించే కలడన్‌ మల్టీమోడల్‌ ట్రాన్సిట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి విస్తృత ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. కంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ వంటి 10 ఆసియన్‌ కూటమి దేశాలకు మిజోరాం ముఖద్వారంగా మారనుందని మోదీ తెలిపారు. 60 మెగావాట్ల తుయిరియల్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టు ప్రారంభించాక అసోం రైఫిల్స్‌ గ్రౌండ్‌లో జరిగిన సభలో ప్రసంగించారు.

ఈ ప్రాజెక్టు ప్రారంభంతో ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం, త్రిపుర తర్వాత మిగులు విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్న రాష్ట్రంగా మిజోరాం అవతరించిందన్నారు.. అనంతరం ఆయన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ వెళ్లారు. పశ్చిమ మేఘాలయలోని తురా ప్రాంతాన్ని రాజధాని షిల్లాంగ్‌తో కలిపే 271 కిలోమీటర్ల డబుల్‌ లేన్‌ రోడ్డును జాతికి అంకితం చేశారు. షిల్లాంగ్‌ ఎయిర్‌పోర్టును భారీ విమానాలు సైతం దిగేలా విస్తరిస్తామన్నారు. ‡1971 ఇండో–పాక్‌ యుద్ధంలో  పోరాడిన భారతీయ సైనికులకు మోదీ అభినందనలు తెలిపారు. విజయానికి గుర్తుగా ఏటా ‘విజయ్‌దివస్‌’గా జరుపుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement