బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్రేప్.. ఆపై హత్య | Missing Schoolgirl Allegedly Gang-Raped, Murdered In Punjab | Sakshi
Sakshi News home page

బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్రేప్.. ఆపై హత్య

Sep 4 2015 10:41 AM | Updated on Sep 3 2017 8:44 AM

బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్రేప్.. ఆపై హత్య

బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్రేప్.. ఆపై హత్య

కిడ్నాప్నకు గురైన ఓ విద్యార్థిని అత్యాచారానికి గురవడంతో పాటు చివరకు శవమై తేలింది.

లూధియానా: కిడ్నాప్నకు గురైన ఓ విద్యార్థిని అత్యాచారానికి గురవడంతో పాటు చివరకు శవమై తేలింది. వివరాలు.. పంజాబ్ లోని లూధియానాకు చెందిన విద్యార్థిని స్కూలు నుంచి ఇంటికి వస్తుండగా బుధవారం సాయంత్రం కిడ్నాప్నకు గురైంది. విద్యార్థినిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అనంతరం గ్యాంగ్ రేప్ చేశారు. గురువారం సాయంత్రం బాలిక శవమై ఓ కాలువలో తేలింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

బాధిత బాలిక శరీరంపై సుమారు 17 గాయాలున్నట్లు వారు తెలిపారు. తలపై పెద్దగా గాట్లు కూడా ఉన్నాయని, బలమైన ఆయుధంతో నిందితులు ఆమెపై దాడి చేసి ఉండవచ్చని తెలుస్తోంది. బాధిత విద్యార్థిని బంధువులు, కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలని మృతదేహంతో వారు ఆందోళన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement