ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం  | Ministry Of Steel Letter About Steel Factory In AP And Telangana | Sakshi
Sakshi News home page

ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం 

Jun 15 2018 5:36 PM | Updated on Jun 15 2018 6:04 PM

Ministry Of Steel Letter About Steel Factory In AP And Telangana - Sakshi

కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు చిత్తశుద్ధితో, నిరంతరంగా కృషి చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్‌ 12న టాస్క్‌ ఫోర్స్‌ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టాస్క్‌ ఫోర్స్‌ ఇరు రాష్ట్రాలలోని బయ్యారం, కడపలలో ఉక్కు పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై సాధ్యమయ్యే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.  2016 సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సమగ్ర చర్చ జరిపినట్లు పేర్కొంది.

జూన్‌ 12న జరిగిన 6వ సమావేశంలో మెకాన్‌తో కలిసి ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు ఫీజిబిలిటి రిపోర్ట్‌ తయారు చేయాలని కోరినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూల్‌ ప్రకారం స్టీల్‌ అథారిటి ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఏఐఎల్‌) ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సాధ్యమమ్యే అంశాలపై 2014 డిసెంబర్‌ 2న ఫిజిబిలిటి రిపోర్ట్‌ ఇచ్చిందన్నారు. ఆ రిపోర్ట్‌ ప్రకారం రెండు ప్రాంతాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆర్థికంగా అనుకూలం కాదని తేలిందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement