ఆకుపచ్చ నిరసన | Message For PM Modi On Fields Of Madhya Pradesh: Encourage Grow In India | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చ నిరసన

May 25 2016 10:00 AM | Updated on Oct 2 2018 6:42 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వ్యవసాయాన్ని ప్రోత్సహించమని భారీ స్థాయిలో పంటను పండించి వినూత్న రీతిలో రైతులు నిరసన తెలిపిన ఘటన మధ్యప్రదేశ్ లోని పరద్ సింగా గ్రామంలో చోటు చేసుకుంది.

భోపాల్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వ్యవసాయాన్ని ప్రోత్సహించమని భారీ స్థాయిలో పంటను పండించి వినూత్న రీతిలో రైతులు నిరసన తెలిపిన ఘటన మధ్యప్రదేశ్ లోని పరద్ సింగా గ్రామంలో చోటు చేసుకుందిఅర్కిటెక్టులు, రైతులు కలిసి ఆకాశం నుండి చూస్తే 'డియర్ ప్రైమ్ మినిస్టర్ ప్లీస్ గ్రో ఆన్ ఇండియా ' అని కనబడే విధంగా పంటను పండిచారు . 7,200 స్కేర్ ఫీట్ విస్థీర్ణంలో పండించిన ఈ పంట బహుశా దేశంలోనే అతి పెధ్ద పంటగా భావిస్తున్నారు.దీనికి మూడు నెలల సమయం పట్టింది .

 

మోదీకి రైతులు ఒక లేఖను కూడా రాశారు . ఇందులో వారు సేంద్రీయ పంటను పండించడానికి పడుతున్న ఇబ్బందులనువిత్తనాలు, ఎరువులు అందక రైతులు ఎదుర్కొంటన్న సమస్యలను మోదీకి వివరించారు. యువత ఎందుకు వ్యయసాయం వైపు రావడంలేదో ఆలోచించాలనిప్రాధమికరంగానికి చేయూతనందిచే చర్యలు తీసుకోవాలని అందులో వారు కోరారు. కళ కలం కన్నా శక్తి వంతమైందని,అందుకే ఇలా కళతో తమ నిరసనను ప్రధానికి తెలియజేశామని రైతు శ్వేతా భట్టద్ పేర్కొన్నారుఈనిరసన పంట చాలా మంది ని ఆకర్షిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement