చనిపోయాడనుకొని అంత్యక్రియలు చేశాక తిరిగొచ్చాడు

Man Declared Dead After Mob Attack Returns Home in Bihar - Sakshi

పట్నా: లేడనుకున్న మనిషి.. ఇక రాలేడునుకున్న వ్యక్తి అకస్మాత్తుగా ప్రత్యక్షమైతే! చనిపోయాడనుకుని అంత్యక్రియలు కూడా నిర్వహించిన వ్యక్తి ఒక్కసారిగా మన ముందుకు వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది?  ఊహించడానికి కూడా కష్టమే. సరిగ్గా ఇలాంటి సంఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. మూక దాడుల్లో చనిపోయాడని భావించిన ఓ వ్యక్తి కి అంత్యక్రియలు నిర్వహించిన మూడు నెలల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు.

వివరాలు.. పట్నాలోని నిసార్‌పురా గ్రామానికి చెందిన కృష్ణ మాంచి అనే వ్యక్తి  ఈ ఏడాదిలో ఆగస్టులో కనిపించకుండాపోయాడు. అదే నెల 10న బీహార్‌లో హమత్పూర్ గ్రామంలో చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారనే నెపంలో ఓ వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేసి చంపారు. అయితే మృతదేహం గుర్తుపట్టకుండా ఉండడంతో దుస్తులు ఆధారంగా అతను కృష్ణ మాంచి అని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు కూడా మృత దేహం కృష్ణ దే అనుకొని అంత్యక్రియలు నిర్వహించారు. అయితే దాదాపు మూడు నెలల తర్వాత కృష్ణ మాంచి తిరిగి తన ఇంటికి వచ్చాడు. అతన్ని చూసిన కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఇక లేడు అనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో ఆనందంతో చిందులేశారు.

‘ నేను మృతదేహాన్ని సరిగా గుర్తించలేదు. దుస్తుల ఆధారంగా అతను నా భర్తే అని గ్రామస్తులు చెప్పడంతో నమ్మేశాను. ఇకలేడు అనుకున్న నా భర్త తిరిగిరావడం అనందంగా ఉంది’  అని కృష్ణ భార్య రూడీదేవి మీడియాకు తెలిపారు. కాగా, కృష్ణ తిరిగి రావడం శుభపరిణామమని, అయితే మూక దాడిలో చనిపోయిన వ్యక్తి  ఎవరో తెలుసుకోవాడానికి విచారణ చేపట్టామని పట్నా సినీయర్‌ పోలీసు అధికారిణి గరిమా మాలిక్‌ పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top