
ఆ దేశ పర్యటనకు ఎదురుచూస్తున్నా:మోదీ
సింగపూర్ ను సందర్శించాల్సిందిగా ఆదేశ డిప్యూటీ ప్రధాన మంత్రి థర్మన్ షన్ముగరత్నమ్ ఆహ్వానించారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూఢిల్లీ: సింగపూర్ లో పర్యటించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సింగపూర్ ను సందర్శించాల్సిందిగా ఆదేశ డిప్యూటీ ప్రధాన మంత్రి థర్మన్ షన్ముగరత్నమ్ ఆహ్వానించారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది. షన్ముగరత్నమ్ మోదీకి స్మాట్ సిటీలు, స్కిల్ డెవలప్ మెంట్, ద్వైపాక్షిక సంబంధాలను గురించి వివరించారని పీఎంఓ తెలిపింది. మోదీ గతేడాది నవంబర్ లో సింగపూర్ లో పర్యటించారు. ఈ నెల 22 న గుండెపోటుతో మరణించిన భారత సంతతికి చెందిన సింగపూర్ దివంగత అధ్యక్షుడు ఎస్.ఆర్. నాథన్ గొప్ప దార్శనికుడని మోదీ కొనియాడారు.