పెళ్లికొడుకు లేకపోతే.. పెళ్లి ఆగాలా? | kerala groom watches his own marriage online from saudi arabia | Sakshi
Sakshi News home page

పెళ్లికొడుకు లేకపోతే.. పెళ్లి ఆగాలా?

Dec 5 2016 2:03 PM | Updated on Sep 4 2017 9:59 PM

పెళ్లికొడుకు లేకపోతే.. పెళ్లి ఆగాలా?

పెళ్లికొడుకు లేకపోతే.. పెళ్లి ఆగాలా?

పెల్లి కొడుకు లేకపోయినా పెళ్లి మాత్రం ఆగకూడదని అనుకున్నారు. అతడు ఆన్‌లైన్‌లో చూస్తుండగా అంతా జరిపించేశారు.

కేరళలో చాలా విచిత్రమైన పెళ్లి ఒకటి జరిగింది. కొల్లాం జిల్లాలోని వెలియం ప్రాంతానికి చెందిన హ్యారిస్ అనే యువకుడు సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తాడు. అతడి పెళ్లికి ముహూర్తం అయితే కుదిరింది గానీ, ఆ సమయానికి సెలవులు మాత్రం లభించలేదు. దాంతో.. ఆన్‌లైన్‌లోనే అతగాడు పెళ్లి చేసేసుకున్నాడు! పెళ్లికూతురు శ్యామలకు పెళ్లికొడుకు హ్యారిస్ అక్క తాళి కట్టగా, ఈ తతంగం అంతటినీ అతడు ఓ వెబ్‌క్యామ్ ద్వారా లైవ్‌లో చూశాడు. ఈ పెళ్లి అళప్పుళ జిల్లాలోని తామరకులం నగరంలో జరిగింది. చాలా ముందుగానే ముహర్తం పెట్టుకున్నా కూడా.. పెళ్లి రోజు హ్యారిస్‌కు సెలవు మాత్రం దొరకలేదు. అయితే, చాలామంది ఇలా పెళ్లి చేసుకుంటామని చెప్పి చివరి నిమిషంలో ఏదో ఒక వంకతో తప్పించుకోవడం ఇంతకుముందు కేరళలో చాలా సందర్భాల్లో జరిగింది. దాంతో అతడు ఎందుకు రాలేదని కూడా పెద్ద చర్చగా మారింది. 
 
కానీ.. పెళ్లికొడుకు రానంత మాత్రాన పెళ్లి జరగకుండా పోదని అతడి తరఫు బంధువులు చెప్పారు. హారిస్ సోదరి నజిత అతడి తరఫున పెళ్లికూతురు మెడలో తాళికట్టింది. ఎటూ ఆడపడుచు అంటే అర్ధమొగుడు అంటారు కాబట్టి అసలు మొగుడికి బదులు ఈ అర్ధమొగుడు కట్టినా పర్వాలేదని శ్యామల సరేనంది. దీన్నంతటినీ హ్యారిస్ సౌదీ అరేబియా నుంచి లైవ్‌లో చూశాడు. రియాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో అతడు మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తాడు. శ్యామల మక్కాలో ఒక ప్రభుత్వాస్పత్రిలో నర్సు. వీళ్లిద్దరూ దగ్గర లేకుండానే మొత్తానికి పెళ్లి మాత్రం అయిపోయింది. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement