ప్లాస్మా థెరఫీకి గ్రీన్‌సిగ్నల్‌

Kejriwal Says Delhi Has Permission For More Plasma Therapy Treatment   - Sakshi

కోవిడ్‌ పడకల కొరత లేదు

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో టెస్టింగ్‌ సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఢిల్లీలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతున్నా ఆందోళన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. కరోనా రోగుల్లో ఇప్పటికే 45,000 మంది కోలుకున్నారని చెప్పారు. గత వారంరోజులుగా ఢిల్లీలో స్వల్ప లక్షణాలతో కూడిన కరోనా కేసులు పెరుగుతున్నాయని, కేవలం 6000 కోవిడ్‌ బెడ్‌లనే వాడుతున్నామని, ఇంకా 13,500 బెడ్లు ఖాళీగా ఉన్నాయని కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు.

అయితే కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో దేశ రాజధానిలో బెడ్‌ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీలో మరింతగా ప్లాస్మా థెరఫీ చికిత్స చేసేందుకు అనుమతి లభించిందని సీరియస్‌ కేసుల్లో ప్లాస్మా థెరఫీ మంచి ఫలితాలను ఇస్తోందని, ఇది మరణాల రేటును తగ్గిస్తుందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. చదవం‍డి : ఢిల్లీలో ప్రతి ఇంట్లో కరోనా పరీక్షలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top