ఆప్ నేత కేజ్రీవాల్ తన అఫిడవిట్‌లో సమాచారాన్ని దాచారంటూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆయనకు, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
- అఫిడవిట్‌లో సమాచారాన్ని దాచారన్న పిటిషన్‌పై హైకోర్టు సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ నేత కేజ్రీవాల్ తన అఫిడవిట్‌లో సమాచారాన్ని దాచారంటూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆయనకు, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి వేసిన నామినేషన్‌లో కేజ్రీవాల్ తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ సమాచారాన్ని దాచిపెట్టడం నేరమని ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియా కోర్టును ఆశ్రయించారు.
కేజ్రీవాల్ ఎన్నికలో పోటీచేయటాన్ని సవాలు చేస్తూ ముందుగా ఈసీకి ఫిర్యాదు చేసినప్పటికీ, ఈసీ పరిగణనలోకి తీసుకోకపోవటంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాకుండా, ఘజియాబాద్‌లో నివసించే కేజ్రీవాల్ నామినేషన్ పత్రాలలో తన చిరునామాగా బీకేదత్ కాలనీని పేర్కొన్నారని తెలిపారు. ఒకవేళ ఆయన దత్ కాలనీలో నివసించినా అది అక్రమమేనని ఆమె చెప్పారు. దత్ కాలనీ ప్రభుత్వ కాలనీ అని ఆ కాలనీలో ఇంటిని అద్దెకు ఇవ్వడం నేరమని ఆమె చెప్పారు.