ఓవర్‌టేక్ చేశాడని చంపేశాడు | JDU Bihar MLC son did murder | Sakshi
Sakshi News home page

ఓవర్‌టేక్ చేశాడని చంపేశాడు

May 9 2016 3:06 AM | Updated on Sep 3 2017 11:41 PM

ఓవర్‌టేక్ చేశాడని చంపేశాడు

ఓవర్‌టేక్ చేశాడని చంపేశాడు

తన కారును ఓవర్‌టేక్ చేశాడనే కారణంతో బిహార్‌లో మహిళా ఎమ్మెల్సీ (జేడీయూ) కుమారుడు ఓ 20 ఏళ్ల యువకుడిని కాల్చి చంపాడు.

బిహార్ జేడీయూ ఎమ్మెల్సీ కొడుకు ఘాతుకం

 గయ: తన కారును ఓవర్‌టేక్ చేశాడనే కారణంతో బిహార్‌లో మహిళా ఎమ్మెల్సీ (జేడీయూ) కుమారుడు ఓ 20 ఏళ్ల యువకుడిని కాల్చి చంపాడు. ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ కుమార్ యాదవ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆదిత్య కుమార్ సచ్‌దేవా అనే యువకుడు గయ వద్ద శనివారం సాయంత్రం రాకీ కారును ఓవర్‌టేక్ చేశాడు. కోపోద్రిక్తుడైన రాకీ.. ఆదిత్యతో గొడవపడ్డాడని.. వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో యువకుడిపై కాల్పులు జరిపాడని కారులో ఆదిత్యతోపాటున్న స్నేహితులు తెలిపారు. రాకీ తండ్రి బిందీ యాదవ్‌ను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న రాకీ కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement