అమెరికా క్షిపణులకంటే 'నిర్భయ్' మేలైంది | India's cruise missile nirbhay is a sub-sonic cruise missile, says satish reddy | Sakshi
Sakshi News home page

అమెరికా క్షిపణులకంటే 'నిర్భయ్' మేలైంది

Oct 17 2014 1:57 PM | Updated on Oct 17 2018 5:51 PM

అమెరికా క్షిపణులకంటే 'నిర్భయ్' మేలైంది - Sakshi

అమెరికా క్షిపణులకంటే 'నిర్భయ్' మేలైంది

భారత్ అమ్ముల పొదిలో నిర్భయ్ క్షిపణి తిరుగులేని అస్త్రమని సైంటిస్ట్ సతీష్ రెడ్డి అన్నారు. క్షిపణి తయారీలో పాలుపంచుకున్న..

హైదరాబాద్ :  భారత్ అమ్ముల పొదిలో నిర్భయ్ క్షిపణి తిరుగులేని అస్త్రమని సైంటిస్ట్ సతీష్ రెడ్డి అన్నారు. క్షిపణి తయారీలో పాలుపంచుకున్న ఆయన చాందీపూర్ నుంచి ప్రయోగం వివరాలను శుక్రవారం 'సాక్షి'కి అందించారు. అతి తక్కువ ఎత్తులో నిర్భయ్ ప్రయాణించగలదని సతీష్ రెడ్డి వెల్లడించారు. క్షిపణి తయారీలో  హైదరాబాద్కు చెందిన రక్షణ ప్రయోగశాల కీలక పాత్ర వహించిందన్నారు.

అమెరికా దగ్గరున్న క్షిపణులకంటే నిర్భయ్ చాలా మేలైనదన్నారు. సముద్రం అలలపై నుంచి 5 మీటర్ల ఎత్తులో కూడా ప్రయాణించగలన్నారు. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్నీ చేధించగలదని, 16 పాయింట్లను టచ్ చేసుకుంటూ క్షిపణి తన గమ్యస్థానాన్ని చేరుకుంటుందన్నారు. కాగా చాందీపూర్ నుంచి ప్రయోగించిన నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement