అమెరికాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి

మైసూరు : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మైసూరు యువకుడు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. గురువారం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైసూరులోని కువెంపు నగర్‌కు చెందిన అభిషేక్ సుధేశ్ భట్ (25) ఇంజనీరింగ్ పూర్తిచేసి ఏడాదిన్నర క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. శాన్ బెర్నార్డియాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ ఓ హోటల్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం హోటల్‌కు వచ్చిన ఓ దుండగుడు అభిషేక్‌తో గొడవపడి, తుపాకితో కాల్పులు జరిపి పారిపోయాడు. తీవ్ర గాయాలతో అభిషేక్ అక్కడిక్కడే మృతి చెందాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి