మానవాభివృద్ధి సూచీలో భారత్‌ @ 129

India moves from 130 to 129 in human development index - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో భారత్‌ 129వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి సోమ వారం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) నివేదిక–2019ను విడుదల చేసింది. తొలి మూడు స్థానాల్లో నార్వే, స్విట్జర్లాండ్, ఐర్లాండ్‌ నిలిచాయి. పాకిస్తాన్‌ 152వ స్థానంలో ఉంది. అట్టడుగున 189 స్థానంలో నైగర్‌ ఉంది. 189 దేశాలతో జాబితా రూపొందించింది. 2005–06 నుంచి 2015–16 వరకు 27.1 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడినట్టు యూఎన్‌డీపీ ఇండియా ప్రతినిధి షోకో నోడా వెల్లడించారు. 2018లో భారత్‌ 130వ స్థానంలో ఉంది. మూడు దశాబ్దాలుగా జరుగుతున్న అభివృద్ధి కారణంగా పేదరికంలోనూ, భారతీయుల ఆయుర్దాయంలోనూ, విద్య, వైద్య సదుపాయాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రిపోర్టు వెల్లడించింది.  

► 1.3 బిలియన్ల మంది నిరుపేదల్లో 28 శాతం మంది భారత్‌లో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకా స్త్రీలు, బాలికలు అసమానతల సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉన్నారు. హా భర్తల చేతిలో హింసకు గురౌతున్న మహిళలు సింగపూర్‌లో అతి తక్కువ.
► దక్షిణాసియాలో 31 శాతం మంది మహిళలు భర్తల చేతిలో హింసకు గురౌతున్నారు.
► లింగ అభివృద్ధి సూచీలో దక్షిణాసియా దేశాల సగటు కంటే భారత్‌ కొద్దిగా మెరుగైన స్థితిలో ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top