నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న భారత ఆర్ధిక శిఖరాగ్ర సదస్పును శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేతో కలిసి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు.
ఆర్థిక శిఖరాగ్ర సదస్సు ప్రారంభించిన శ్రీలంక ప్రధాని
Oct 6 2016 11:05 AM | Updated on Sep 4 2017 4:25 PM
న్యూఢిల్లీ: నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న భారత ఆర్ధిక శిఖరాగ్ర సదస్పును శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేతో కలిసి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, ప్రాంతీయ ఆర్థిక సమగ్రతలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. భారతదేశంలోని నాల్గవ పారిశ్రామిక విప్లవం, ఇంధన సామర్ధ్యం, మౌలిక సదుపాయాలు పెట్టుబడిదారుల ఇబ్బందులు, అంకుర పరిశ్రమలపై చర్చించనున్నారు. వ్యాపారవేత్తలు, వివిధ కంపెనీల సీఈఓలు వివిధ రంగాల ప్రముఖులు 500 మంది రెండు రోజుల సదస్సులో పాల్గొంటారు.
Advertisement
Advertisement