పాకిస్థాన్‌పై భారత్‌ సీరియస్‌

India drags Pakistan to UN after it Says not to use of airspace - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విమానం ప్రయాణించేందుకు వీలుగా గగనతల అనుమతి ఇచ్చేందుకు పాకిస్తాన్‌ నిరాకరించడాన్ని భారత్‌ సీరియగా పరిగణించింది. ఈ విషయంలో దాయాది దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తోంది. అంతర్జాతీయ పౌర విమానాయాన సంస్థ (ఐసీఏవో) దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే యోచనలో కేంద్రం ఉంది. ఒక దేశానికి సంబంధించిన విదేశీ గగనతల ప్రయాణ అనుమతులకు సంబంధించి సమస్యలు, ఫిర్యాదులను ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఐసీఏవో చూసుకుంటోంది.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్రం రద్దు చేయడంతో పాకిస్థాన్‌ దుందుడుకు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ దాయాది తమ గగనతలంలో భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధం విధించింది. ప్రధాని నరేంద్రమోదీ విమానానికి కూడా అనుమతి ఇప్పటికే రెండుసార్లు అనుమతి నిరాకరించినప్పటికీ.. భారత్‌ సంయమనం పాటించింది. తాజాగా యూఏఈ పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ బయలుదేరుతున్న నేపథ్యంలో భారత్‌ మరోసారి గగనతల అనుమతి కోరింది. తాజాగా కూడా పాక్‌ నిరాకరించడంతో ఫిర్యాదు చేయడమే సరైన చర్యగా భావిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం యూఏఈ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top