కశ్మీర్‌ బాలికలకు హిజ్బుల్‌ వార్నింగ్‌.. | Hizbul Releases Poster Threatening Kashmiri Girls | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌ బాలికలకు హిజ్బుల్‌ వార్నింగ్‌..

Nov 23 2018 1:52 PM | Updated on Nov 23 2018 2:16 PM

Hizbul Releases Poster Threatening Kashmiri Girls - Sakshi

ఆ వీడియోలు అప్‌లోడ్‌ చేయవద్దని బాలికలకు హిజ్బుల్‌ హెచ్చరిక

శ్రీనగర్‌ : భద్రతా దళాలను తమను నిలువరించాలని సవాల్‌ విసిరిన ఉగ్ర సంస్థ హిజ్బుల్‌ ముజహిదిన్‌ తాజాగా కశ్మీరీ బాలికలను హెచ్చరించింది. డ్యాన్స్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్న బాలికలకు ఇదే చివరి హెచ్చరికని, వారు ఈ పని మానుకోవాలి లేదా వారి కాళ్లు తెగనరుకుతామని, అందుకు సిద్ధంగా ఉండాలంటూ పోస్టర్లను విడుదల చేసింది.

శ్రీనగర్‌లో ఇటీవల తాము సమావేశమయ్యామని తదుపరి భేటీ ఢిల్లీలో ఉంటుందని హిజ్బుల్‌ చీఫ్‌ రియాజ్‌ నైకూ వెల్లడించినట్టు తెలిసింది. హిజ్బుల్‌లోకి పెద్ద సంఖ్యలో బాలికలు, ఇతరులను రిక్రూట్‌ చేసుకోవాలని శ్రీనగర్‌ భేటీలో ఉగ్రసంస్థ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత్‌తో పాటు దాని సంస్థలతో ఎలా పోరు సాగించాలనే కసరత్తుపై తమ భేటీ 47 గంటల పాటు సుదీర్ఘంగా సాగిందని హిజ్బుల్‌ ప్రతినిధి పేర్కొన్నారని జీ మీడియా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement