మరో ఇద్దరు విద్యార్దుల మృతదేహాలు లభ్యం | Himachal pradesh tragedy: Another two bodys recovered | Sakshi
Sakshi News home page

మరో ఇద్దరు విద్యార్దుల మృతదేహాలు లభ్యం

Jun 12 2014 11:33 AM | Updated on Apr 3 2019 7:53 PM

మరో  ఇద్దరు విద్యార్దుల మృతదేహాలు లభ్యం - Sakshi

మరో ఇద్దరు విద్యార్దుల మృతదేహాలు లభ్యం

బియాస్ నదిలో మరో ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

మండి : బియాస్ నదిలో మరో ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సహాయక సిబ్బంది గురువారం ఉదయం  రెండు మృతదేహాలను  వెలికి తీశారు. ఇప్పటివరకూ ఎనిమిది మృతదేహాలు లభ్యం అయ్యాయి.  మరో 16మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ అయిదోరోజు గాలింపు జరుగుతోంది. కాగా  రెండు మృతదేహాల్లో ఒకటి ఖమ్మం జిల్లాకు చెందిన ఉపేందర్ ది కాగా, మరో మృతదేహం అరవింద్ ది కుటుంబ సభ్యులు గుర్తించారు.

ఇక కేంద్ర ప్రకృతి విపత్తుల నిర్వహణా సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి స్వయంగా  గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ కూడా ఘటనాస్థలంలోనే ఉన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement