జైపాల్‌రెడ్డి మంచి పాలనాదక్షుడు

Former PM Manmohan Singh Praises Jaipal Reddy In Delhi - Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ :  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మంచి పాలనాదక్షుడని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కొనియాడారు. సోమవారం ఇండియా ఇంటర్‌ నేషనల్ సెంటర్‌లో జైపాల్‌రెడ్డి సంతాప సభ జరిగింది. ఈ సభలో మన్మోహన్‌ సింగ్‌తో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. జైపాల్‌ రెడ్డి నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేయడంలో ఎక్కడా రాజీ పడలేదని తెలిపారు. పదేళ్లపాటు తన మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగారని చెప్పారు. ప్రసార భారతి బిల్లుతో దూరదర్శన్‌, ఆకాశవాణికి స్వయం ప్రతిపత్తి కల్పించారని చెప్పారు.

వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చినప్పటికీ అత్యుత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు తెచ్చుకున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో నిశ్శబ్దంగా  చాలా కీలక పాత్ర పోషించారన్నారని, ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయం తీసుకోవడానికి పార్టీ నాయకత్వాన్ని ఒప్పించారని మన్మోహన్‌ సింగ్‌ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top