ఎలక్ట్రానిక్ మీడియానూ ప్రెస్‌కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలంటూ.. పార్లమెంటరీ కమిటీ సూచనలు చేసింది.
పార్లమెంటు కమిటీ సూచన
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ మీడియానూ ప్రెస్‌కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలంటూ.. పార్లమెంటరీ కమిటీ సూచనలు చేసింది. ఓ వర్గం మీడియా అనైతిక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నందున ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావటం అవసరమని సూచించింది. దీంతో పాటు ప్రెస్ కౌన్సిల్ అధికారాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.
పలు మీడియా సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్నందున కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కఠినచర్యలు తీసుకోలేకపోతోందని.. పెయిడ్ న్యూస్ ను నియంత్రించటంలోనూ స్పష్టమైన చట్టాలుండాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొం ది. కేబుల్ టీవీ నెట్‌వర్క్ యాక్ట్ (ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ చట్టం పరిధిలోకే వస్తుంది) అమలుకు ఓ చట్టబద్ధమైన సంస్థ ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది.