మరో 5 రోజులు డీకే రిమాండ్‌ కోరిన ఈడీ..

ED seeks Five Day Remand Of Karnataka Congress Leader DK Shivakumar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్‌ కేసులో అరెస్టైన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌ రిమాండ్‌ శుక్రవారంతో ముగియడంతో ఈడీ అధికారులు ఆయనను రోజ్‌ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. కేసు విచారణలో తమ ప్రశ్నలకు డీకే శివకుమార్‌ బదులివ్వకుండా సమయం వృధా చేశారని ఆయనను మరో అయిదు రోజుల పాటు రిమాండ్‌కు అప్పగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు.

విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు శివకుమార్‌ సూటిగా బదులివ్వలేదని, సంబంధం లేని సమాధానాలు ఇచ్చారని న్యాయస్ధానం దృష్టికి తీసుకువచ్చారు. తన బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్లు ఎలా సమకూరాయన్నది వెల్లడించలేదని, ఆయన ఆస్తుల్లో చాలావరకూ బినామీ ఆస్తులేనని ఈడీ పేర్కొంది. విచారణకు డీకే సహకరించలేదని, విచారణ సమయంలో పలుమార్లు విరామం పేరుతో సమయం వృధా చేశారని తెలిపింది. ఇతర నిందితులతో కలిసి ప్రశ్నించేందుకు ఆయనను మరో 5 రోజులు రిమాండ్‌కు తరలించాలని ఈడీ కోరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top