‘గుజరాత్‌ గాడిదలకు ప్రచారం ఆపండి' | Don't promote Guj's donkeys, Akhilesh tells Bollywood's greatest actor | Sakshi
Sakshi News home page

‘గుజరాత్‌ గాడిదలకు ప్రచారం ఆపండి'

Feb 20 2017 3:33 PM | Updated on Aug 25 2018 4:30 PM

‘గుజరాత్‌ గాడిదలకు ప్రచారం ఆపండి' - Sakshi

‘గుజరాత్‌ గాడిదలకు ప్రచారం ఆపండి'

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రచారం పీక్‌ స్టేజ్‌కు వెళుతోంది. ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతలనే టార్గెట్‌ చేసుకుంటూ వెళుతున్న ప్రచారాలు ఏకంగా ప్రాంతాల వారిగా వెళుతోంది.

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రచారం పీక్‌ స్టేజ్‌కు వెళుతోంది. ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతలనే టార్గెట్‌ చేసుకుంటూ వెళుతున్న ప్రచారాలు ఏకంగా ప్రాంతాల వారిగా వెళుతోంది. గుజరాత్‌ గాడిదలకు ప్రచారం ఆపేయండంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు సూచించారు. ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేసే ఉద్దేశంతో అఖిలేశ్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గుజరాత్‌ గాడిదల కోసం ఓ వాణిజ్య ప్రకటన ఉంది. ఆ ప్రకటనలో నటించి గొప్ప బాలీవుడ్‌ నటుడు(అమితాబ్‌ బచ్చన్‌)కి నేనొక విన్నపం చేసుకుంటున్నాను. గుజరాత్‌ గాడిదలకు ప్రచారం కల్పించకండి’ అని ఉత్తరప్రదేశ్‌లోని ఎన్నికల ర్యాలీలో కాస్తంత వివాదాస్పదంగా సూచించారు.

రాష్ట్ర అటవీ జంతు సంపదకు సంబంధించి గుజరాత్‌ టూరిజం శాఖ అమితాబ్‌ బచ్చన్‌ను నటుడుగా తీసుకొని వాణిజ్య ప్రకటనలు తీసుకొంది. గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ప్రాంతంలోని వణ్యమృగ ప్రాణుల సంరక్షణతోపాటు పర్యాటనకు ఆహ్వానిస్తూ అమితాబ్‌ ఇందులో నటించారు. ఆ జంతువుల్లో గాడిదలు కూడా ఉన్నాయి.

గత కొద్ది రోజులగా మోదీపై విసురుగానే విమర్శలు చేస్తున్న అఖిలేశ్‌ ఈ ప్రకటన ఆధారంగా మరోసారి మోదీపై పరోక్షంగా విమర్శలు చేశారు. అయితే, గుజరాత్‌ ఆస్తులకు బచ్చన్‌ ప్రచారం చేయొద్దని చెప్పడమే తన ఉద్దేశం అని మరోసారి మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది. మరో విశేషమేమిటంటే అమితాబ్‌ బచ్చన్‌ భార్య జయాబచ్చన్‌ సమాజ్‌వాది పార్టీలో సభ్యురాలు.

Advertisement
 
Advertisement
Advertisement