ఆ బాలుడి నోట్లో 526 దంతాలు!

Doctors Remove 526 Teeths From Chennai Boy Mouth - Sakshi

చెన్నై : కొన్ని కొన్ని విషయాలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యమేస్తోంది. అలాంటి ఘటనే తాజాగా తమిళనాడులో చోటుచేసుకంది. మాములుగా ఎవరికైనా నోటిలో 32 దంతాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. కానీ చెన్నైకి చెందిన ఓ ఏడేళ్ల బాలుడి నోటిలో 526 దంతాలు ఉన్నాయి. బాలుడికి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు ఆ దంతాలను బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆ బాలుడి తల్లిదండ్రులు అతనికి మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే దవడ వాపు ఉండటాన్ని గమనించారు. అయితే అది అప్పుడు చిన్నగానే ఉండటంతో వారు అంతగా పట్టించుకోలేదు. ఆ బాలుడు కూడా వాపును చూపించడానికి ఇష్టపడేవాడు కాదు. కానీ కాలం గడుస్తున్న కొద్ది దవడ వాపు పెరుగుతూ వచ్చింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు బాలుడిని చెన్నైలోని సవిత డెంటల్‌ కాలేజ్‌కు తీసుకెళ్లారు. 

అసలు బాలుడికి దవడ ఎందుకు వాచిందో తెలుసుకోవడానికి వైద్యులు ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ నిర్వహించారు. ఆ తర్వాత బాలుడి కుడి దవడ కింద భాగంలో సంచి మాదిరిగా ఉబ్బి ఉండటం వారిని ఆశ్చర్యపరిచింది. శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ దవడ భాగంలో దాగివున్న దంతాలను వైద్యులు బయటకు తీశారు. మొత్తం 200 గ్రాముల బరువున్న 526 దంతాలను వైద్యులు గుర్తించారు. ఈ దంతాలు రకరకాల సైజుల్లో ఉన్నట్టు తెలిపారు. ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసిందని.. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని సవిత డెంటల్‌ కాలేజ్‌ ప్రొఫెసర్‌ ప్రతిభ రమణి తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే తొలిసారని వారు చెబుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top