నిర్వాసితుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా కేంద్ర భూసేకరణ చట్టానికి ఏపీ ప్రభుత్వం చేసిన సవరణలను
- ఆ సవరణ చట్టాన్ని ఆమోదించకండి
- రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఏపీసీసీ నేతల విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: నిర్వాసితుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా కేంద్ర భూసేకరణ చట్టానికి ఏపీ ప్రభుత్వం చేసిన సవరణలను ఆమోదించవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఏపీసీసీ నేతలు కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు, టి.సుబ్బిరామిరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం బుధవారమిక్కడ రాష్ట్రపతిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
యూపీఏ హయాంలో తెచ్చిన భూసేకరణ చట్టంలో.. భూమి పోగొట్టుకొనే రైతులకే కాకుండా దాని మీద ఆధారపడ్డవారి ప్రయోజనాలు కాపాడేలా నిబంధనలు రూపొందించారని పేర్కొన్నారు. ఏపీ ప్రతిపాదించిన సవరణలు నిర్వాసితుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నందున సవరణ చట్టాన్ని ఆమోదించవద్దని రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు.