జేఎన్‌యూ విద్యార్థులపై నోటీసులు | Delhi police issues look out notice against three JNU students | Sakshi
Sakshi News home page

జేఎన్‌యూ విద్యార్థులపై నోటీసులు

Feb 21 2016 12:47 AM | Updated on Aug 21 2018 5:51 PM

జేఎన్‌యూ విద్యార్థులపై నోటీసులు - Sakshi

జేఎన్‌యూ విద్యార్థులపై నోటీసులు

జేఎన్‌యూలో నిర్వహించిన దేశ వ్యతిరేక నినాదాల కార్యక్రమంతో సంబంధముందన్న ముగ్గురు విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు.

‘పటియాలా’ కేసులో లాయర్ అరెస్టు
 
 న్యూఢిల్లీ: జేఎన్‌యూలో నిర్వహించిన దేశ వ్యతిరేక నినాదాల కార్యక్రమంతో సంబంధముందన్న ముగ్గురు విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ ముగ్గురు దేశం వదిలివెళ్లకుండా అప్రమత్తం చేస్తూ... విషయాన్ని విదేశీ ప్రాంతీయ నమోదు కేంద్రాలకు తెలిపారు. మరోవైపు  కన్హయ్య అరెస్టును వ్యతిరేకిస్తూ శనివారం ఢిల్లీ వర్సిటీలో విద్యార్థులు ఆందోళన కొనసాగించారు.

 కోర్టులో దాడి కేసులో న్యాయవాది అరెస్టు
 పటియాలా హౌస్ కోర్టు దాడి కేసులో న్యాయవాది ఓం శర్మను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ కోసం తిలక్ మార్గ్ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు, పలు సెక్షన్ల కింద అరెస్టు చేసి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. దేశద్రోహం కేసులో అరెస్టైన కన్హయ్య పేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందంటూ కొందరు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.

 జామియా విద్యార్థులు?.. జామియా మిలియా వర్సిటీ విద్యార్థులు కొందరు జేఎన్‌యూ, ప్రెస్‌క్లబ్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారంటూ స్టూడెంట్స్ కమిటీ వీసీకి లేఖ రాసింది. వీడియోల్లో వారిని గుర్తించామంది.

 కేజ్రీవాల్‌పై బస్సీ ఫైర్: ట్విట్టర్ పేరడి ఖాతాలోని ట్వీట్ తనను ఎగతాళి చేసేలా ఉండడంతో ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ...కేజ్రీవాల్‌తో పాటు టీవీ ఛానల్ విలేకరిపై  ఫైరయ్యారు. ఒక టీవీఛానల్ విలేకరి పేరిట ఉన్న ఈ ఖాతా ట్వీట్స్‌పై కేజ్రీవాల్ ప్రతిస్పందించడంపై బస్సీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

 జాదవ్‌పూర్ వర్సిటీ వీసీపై బీజేపీ కన్నెర్ర
 కోల్‌కతాలోని జాదవ్‌పూర్ వర్సిటీలో ఇటీవల దేశ వ్యతిరేక నినాదాలు చేసిన విద్యార్థులపై వైస్‌చాన్స్‌లర్ సురంజన్ దాస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ మండ్డిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement