ఆరెస్సెస్‌ నేతపై ఉగ్రవాదుల కాల్పులు

Curfew Imposed In Kishtwar After Terrorists Attack RSS Leader - Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. కిష్ట్వార్‌ పట్టణంలో ఆరెస్సెస్‌ నేత చంద్రకాంత్‌పై దాడిచేసిన ఉగ్రవాదులు ఆయన వ్యక్తిగత భద్రతాధికారిని హత్య చేశారు. చంద్రకాంత్‌ వైద్య పరీక్ష కోసం స్ధానిక ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరెస్సెస్‌ నేతకు గాయాలయ్యాయి.

ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం ఆస్పత్రిలోకి చొచ్చుకువచ్చిన ఉగ్రవాదులు చం‍ద్రకాంత్‌ భద్రతా అధికారి నుంచి తుపాకీని లాక్కుని చంద్రకాంత్‌ సహా ఆయన భద్రతా అధికారిపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల ఘటనలో చంద్రకాంత్‌ వ్యక్తిగత భద్రతాధికారి మరణించారు. ఆరెస్సెస్‌ నేతకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఆరెస్సెస్‌ నేతపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పట్టణంలో కర్ఫ్యూ విధించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top