కేజ్రీవాల్ - కిరణ్ బేడీల మధ్యే పోటీ: స్నాప్ పోల్ | competition between Kejriwal and Kiran Bedi : Snap Poll | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ - కిరణ్ బేడీల మధ్యే పోటీ: స్నాప్ పోల్

Feb 1 2015 8:15 PM | Updated on Sep 2 2017 8:38 PM

కిరణ్ బేడీ - కేజ్రీవాల్

కిరణ్ బేడీ - కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత కిరణ్ బేడీల మధ్యే పోటీ నెలకొందని ఏబీపీ న్యూస్-నీల్సన్ 'స్నాప్ పోల్'లో వెల్లడైంది.

 న్యూఢిల్లీ:   ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత కిరణ్ బేడీల మధ్యే పోటీ నెలకొందని ఏబీపీ న్యూస్-నీల్సన్ 'స్నాప్ పోల్'లో వెల్లడైంది. ఢీల్లీ సీఎం పదవికి ఉత్తమ అభ్యర్థిగా కేజ్రీవాల్ 47 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇటీవలే బీజేపీలో చేరిన కిరణ్ బేడీ సర్వేలో 44 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. సర్వే ఫలితాల ప్రకారం.. మహిళా ఓటర్లలో 50  శాతం మంది కేజ్రీవాల్ వైపు మొగ్గుచూపగా, బేడీకి 41.4 శాతం మద్దతు తెలిపారు.

కిరణ్‌బేడీ ఆప్‌లో చేరి ఉండాల్సిందని 44 శాతం మంది అభిప్రాయపడగా, బీజేపీలో చేరడమే సరైందని 23 శాతం అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఈ నెల శని-సోమవారాల(17-19 తేదీలు) మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 1,489 మంది పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీలో మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని జనవరి 11-15 తేదీల మధ్య న్యూస్ నేషన్ నిర్వహించిన మరో ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement