ఏపీని ఆర్థికంగా ఆదుకోమని కోరాం: చంద్రబాబు | chandrbabu naidu press meet in delhi | Sakshi
Sakshi News home page

ఏపీని ఆర్థికంగా ఆదుకోమని కోరాం: చంద్రబాబు

Sep 24 2015 6:35 PM | Updated on Sep 3 2017 9:54 AM

ఏపీని ఆర్థికంగా ఆదుకోమని కోరాం: చంద్రబాబు

ఏపీని ఆర్థికంగా ఆదుకోమని కోరాం: చంద్రబాబు

రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్ని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

న్యూఢిల్లీ :  రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్ని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన గురువారం ఢిల్లీలో ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని కోరామని, పక్క రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకూ సాయం చేయమన్నామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడ్డ సమస్యలన్నింటినీ కేంద్ర మంత్రులకు వివరించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే విభజనతో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, పొగాకు రైతులను ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement