కశ్మీర్‌పై కేంద్ర కీలక ఆదేశాలు

Centre Asks Forces Not To Launch Operations In Kashmir During Ramadan - Sakshi

న్యూఢిల్లీ: కల్లోల కశ్మీర్‌లో భద్రతా బలగాల కార్యకలాపాలకు సంబధించి కేంద్రం బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. పవిత్ర రంజాన్‌ మాసంలో భద్రతా పరమైన ఆపరేషన్లు చేపట్టవద్దని చెప్పింది. అయితే, అవతలివారు హింసాయుత చర్యలకు పాల్పడిన పక్షంలోగానీ, సామాన్య పౌరుల ప్రాణాలాను కాపాడేందుకుగానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిదాడి చేయవచ్చని సూచించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం సంబంధిత అధికారులకు లేఖలు పంపింది. గురువారం నుంచి రంజాన్‌ మాసం ప్రారంభమవుతుండటం తెలసిందే.

ఇదిలాఉంటే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం కూడా పలు విధ్వంసకర ఘటనలు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్‌లోని చత్తాబల్‌ ప్రాంతంలో గ్రెనేడ్‌ పేలుడు సంభవించింది. తీవ్రంత స్వల్పంగా ఉండటంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. పుల్వామా జిల్లాలో జరిగిన మరో సంఘటనలో.. రాజ్‌పోరా పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. అవికాస్తా గురి తప్పడంతో పక్కనున్నదుకాణాలు ధ్వంసమయ్యాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top