మావోయిస్టుల దాడి : ఆర్మ్ డ్ జవాన్ మృతి | CAF jawan killed in Naxal attack | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల దాడి : ఆర్మ్ డ్ జవాన్ మృతి

Dec 10 2015 11:22 AM | Updated on Sep 3 2017 1:47 PM

ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని ఆర్మ్డ్ శిబిరంపై మావోయిస్టులు గురవారం దాడి చేశారు.

రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని ఆర్మ్డ్ శిబిరంపై మావోయిస్టులు గురవారం దాడి చేశారు. ఈ దాడిలో ఛత్తీస్గఢ్ ఆర్మీడ్ ఫోర్స్కు చెందిన జవాన్ అశ్వీని సింగ్ రాజ్పుట్ మరణించాడు.  ఈ మేరకు నారాయణపూర్ జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా వెల్లడించారు.  ఈ రోజు తెల్లవారుజామున ఆర్మ్ డ్ శిబిరం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై మావోయిస్టులు దాడి చేసి కాల్పులకు దిగారని చెప్పారు.

వెంటనే అప్రమత్తమైన ఆర్మీడ్ సిబ్బంది ఎదురుకాల్పులకు జరిపారు.   ఈ కాల్పుల్లో జవాన్ అశ్వీన్ మరణించారని తెలిపారు. అనంతరం మావోయిస్టులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారని వెల్లడించారు. వారిని పట్టుకునేందుకు జవాన్లు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారని మీనా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement