రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీజేపీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆప్‌లో చేరటంపై నోరు మెదపలేదు.
చండీగఢ్: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీజేపీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆప్‌లో చేరటంపై నోరు మెదపలేదు. అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటమంటేనే బీజేపీ నుంచి తప్పుకోవటమేనని ఆయన భార్య నవజోత్ కౌర్ తెలిపారు. సిద్ధూకు ఆప్‌లో చేరటం తప్ప వేరే మార్గం లేదని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఆప్ తరపున పంజాబ్ సీఎం అభ్యర్థిగా సిద్ధూ పేరును ఇప్పుడే ప్రకటించటం సరైంది కాదని కేజ్రీవాల్ అన్నారు. ‘ఆయనిప్పుడే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా. మంచివాళ్లంతా బీజేపీని వదిలి రావాలి’ అని కేజ్రీవాల్ అన్నారు. కాగా, సిద్ధూ, కౌర్ వారం లోగా తమ పార్టీలో చేరతారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆప్‌పై సిద్దూ చేసిన వ్యంగ్యమైన వ్యాఖ్యల వీడియో క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. అదో పెద్ద విషయం కాదన్నారు.