ఎయిమ్స్‌లో బిహార్‌ సీఎం నితీష్‌.. | Bihar CM Nitish Kumar Admitted To AIIMS | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌లో బిహార్‌ సీఎం నితీష్‌..

Sep 18 2018 11:59 AM | Updated on Sep 18 2018 11:59 AM

Bihar CM Nitish Kumar Admitted To AIIMS - Sakshi

బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ (ఫైల్‌ఫోటో)

ఎయిమ్స్‌లో నితీష్‌ కుమార్‌కు వైద్య పరీక్షలు..

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. రొటీన్‌ హెల్త్‌ చెకప్‌ కోసమే ఆయన ఎయిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

నితీష్‌ కుమార్‌ మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఎయిమ్స్‌ ప్రైవేట్‌ వార్డులో చేరారని తెలిపాయి. జ్వరం, కన్ను, మోకాలి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలపడంతో నితీష్‌ను ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. నితీష్‌ ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులు వెల్లడిస్తారని ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement