ఆవుదూడలకు ఇక ఆ బాధ ఉండదు..! | Ayodhya Municipal Corporation Decided To Buy Jute Coats For Cows | Sakshi
Sakshi News home page

అయోధ్య : ఆవుదూడలకు ఇక ఆ బాధ ఉండదు..!

Nov 24 2019 6:02 PM | Updated on Nov 24 2019 6:12 PM

Ayodhya Municipal Corporation Decided To Buy Jute Coats For Cows - Sakshi

1200 ఆవులు, 700 ఎద్దులు, లేగదూడలు గల బైసింగ్‌పూర్‌ గోసంరక్షణ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.

అయోధ్య : నగరంలోని ఆవులకు భలే వెచ్చటి రోజులు వచ్చాయి. అయోధ్య మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని గోశాలల్లో ఉండే ఆవులు, దూడలు, ఎద్దులకు చలివేయకుండా గరం కోట్లు వేయనున్నట్టు కమిషనర్‌ నీరజ్‌ శుక్లా తెలిపారు. పవిత్ర భూమిలో ఉన్న షెల్టర్లలో ఉన్న గోవుల సంరక్షణే తమ కర్తవ్యమని వెల్లడించారు. 1200 ఆవులు, 700 ఎద్దులు, లేగదూడలు గల బైసింగ్‌పూర్‌ గోసంరక్షణ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. మొదట 100 ఆవులకు స్వెటర్ల కోసం ఆర్డర్‌ ఇచ్చామని అన్నారు. నవంబర్‌ చివరి నాటికి అవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

రెండు మూడు దశల్లో పూర్తిస్థాయిలో స్వెటర్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.జూట్‌తో తయారు చేసే.. వీటి ధర ఒక్కోటి రూ.250-300 ఉంటుందని శుక్లా పేర్కొన్నారు. లేగదూడలకు మూడు వరుసలు, ఆవులకు రెండు వరుసలు, ఎద్దులకు ఒక వరుస జూట్‌ స్వెటర్లు తయారు చేయిస్తామని అన్నారు. చలి తీవ్రత పెరిగినప్పుడు గోవుల రక్షణకు షెల్టర్ల వద్ద మంటకూడా రాజేస్తామని శుక్లా చెప్పారు. అయోధ్య కార్పొరేషన్‌లో ఉన్న గోసంరక్షణ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని నగర మేయర్‌ రుషికేష్‌ ఉపాధ్యాయ్‌ అన్నారు. మరిన్ని గోసంరక్షణ కేంద్రాలు నెలకొల్పుతామని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement