న్యూఢిల్లీలో ఏపీఎన్జీవో నేత గుండెపోటుతో మృతి | APNGO Leader died at Ramleela ground in New delhi | Sakshi
Sakshi News home page

న్యూఢిల్లీలో ఏపీఎన్జీవో నేత గుండెపోటుతో మృతి

Feb 17 2014 11:10 AM | Updated on Sep 2 2017 3:48 AM

సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు సోమవారం రాంలీలా మైదానంలో చేపట్టిన ధర్నాలో అపశృతి చోటు చేసుకుంది.

సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు సోమవారం రాంలీలా మైదానంలో చేపట్టిన ధర్నాలో అపశృతి చోటు చేసుకుంది.నెల్లూరు జిల్లా ఏపీఎన్జీవో ఉపాధ్యక్షుడు దామోదర్ జోషికి తీవ్ర గుండె పోటు వచ్చింది. దాంతో ఆయన సహచరులు వెంటనే స్పందించి దామోదర్ జోషిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన మార్గమధ్యంలోనే మరణించారు. దామోదర్ జోషి మృతికి ఏపీఎన్జీవోలు రాంలీలా మైదానంలో సంతాపం తెలిపారు.    

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు ఏపీఎన్జీవోలు దేశ రాజధానిలోని రాంలీలా మైదానంలో సోమవారం మహాధర్నా చేపట్టారు.అందులోభాగంగా సీమాంధ్రలోని పలు జిల్లా నుంచి మొత్తం మూడు రైళ్లలో వేలాది మంది ఏపీఎన్జీవోలు న్యూఢిల్లీ తరలివెళ్లారు.అలా వెళ్లిన దామోదర్ జోషి మృతి చెందడంతో అటు రాంలీలా మైదానం ఇటు నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement