మోదీ చేసింది సరైన పనేనా?: సునీతా కేజ్రీవాల్‌ | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమి ర్యాలీ.. ఢిల్లీలో భారీ భద్రత..

Published Sun, Mar 31 2024 9:26 AM

INDIA Alliance Rally Delhi CM Arvind Kejriwal Arrest Live Updates - Sakshi

Live Updates..

ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ:
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కామెంట్లు...

 • ప్రజాస్వామ్యం కావాలో,నియంతృత్వవం కావాలో  మీరే(ప్రజలు) నిర్ణయించుకోవాలి 
 • నియంతృత్వానికి మద్దతు ఇచ్చేవారిని దేశం నుంచి తరిమిగొట్టాలి.
 • బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విషం లాంటివి
 • వాటి విషం రుచి చూసినా మరణిస్తాం
   

ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ:
కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కామెంట్లు 

 • బీజేపీ భ్రమల్లో ముగినిపోయింది. వారికి నేను వెయ్యేళ్లనాటి కథ, నీతిని తెలియజేస్తున్నా. రాముడు సత్యం కోసం యుద్ధం చేశారు. 
 • రాముడికి అధికారం, వనరులు లేవు. రాముడికి కానీసం రథం కూడా లేదు. 
 • రావణాసురుడికి రథం, వనరులు, యుద్ధ సైన్యం ఉంది. 
 • రాముడి వద్ద సత్యం, నమ్మకం, విశ్వాసం, ఓర్పు, తెగువ ఉందని గుర్తు చేశారు.
 • ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేస్తోంది

ఐదు డిమాండ్లు ఇవే...

 • ఎన్నికల  సంఘం లోక్‌సభ ఎన్నికల్లో అందరినీ సమానంగా చూడాలి 
 • బలవంతంగా ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ , ఐటీ అరెస్ట్‌లు, దాడులు ఆపేయాలి
 • వెంటనే సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, హెమంత్‌ సోరెన్‌ను విడిచిపట్టాలి0
 • ప్రతిపక్షాల ఆర్థిం వనరులను దెబ్బతీయటం ఆపేయాలి 
 • బీజేపీ పొందిన ఎలక్టోరల్‌ బాండ్ల విషయంలో సిట్‌ ఏర్పాటు చేసి వెంటనే దర్యాప్తు జరపాలి

ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ:
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కామెంట్లు

 • బీజేపీ 400 సీట్లు గెలుపు నినాదం సెటైర్లు
 • ఈవీఎంలు లేకుండా, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, సోషల్‌ మీడియా,  మీడియాపకై ఒత్తిడి పెంచకుండా బీజేపీ కనీసం 180 సీట్లు కూడా గెలవలేదు.

ఆర్జేడీ నేత, మాజీ  డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ కామెంట్లు

 • ఈడీ, సీబీఐ అండ్‌ ఐటీ బీజేపీకి చెందిన విభాగాలు.
 • లాలూ ప్రసాద్‌ యావద్‌ను చాలా సార్లు వేధించాయి. 
 • మాపై వ్యతిరేకంగా కేసులు పెట్టారు. 
 • మా కుటుంబంలోని అందరిపై కేసులు మోపారు 
 • ఆర్జేడీ నేతలపై తరచూ సోదాలు జరుగుతున్నాయి
 • ఈడీ, ఐడీ సోదాలు  జరుగుతునే ఉన్నాయి.
 • మేము ఎప్పడూ భయపడలేదు.. పోరాడుతూనే ఉన్నాం.

టీఎంసీ ఇండయా కూటమిలో భాగమే..

 • ‘టీఎంసీ  ఇండియా కూటమిలో భాగమే.  ప్రజాస్వామ్యాకి బీజేపీకి మధ్య యుద్ధం జరుగుతోంది’టీఎంసీ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ అన్నారు. 

ఇండియా కూటమికి  ఆప్‌ తరఫున  మద్దతు తెలుపుతున్నా: సునీతా కేజ్రీవాల్‌

 • ఇండియా కూటమి కాదు..  ఇండియా అనేది మనందరి హృదయం 
 • అరవింద్‌ కేజ్రీవాల్‌  ఇచ్చిన ఆరు గ్యారంటీలను చదివి వినిపించారు.

ఆరు గ్యారంటీలు..

 • దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉండవు.  
 • దేశవ్యాప్తంగా పేదలకు విద్యుత్ ఉచితం. 
 • ప్రతి గ్రామంలో  పిల్లలు నాణ్యమైన విద్యను పొందే మంచి పాఠశాల ఏర్పాటు
 • గ్రామంలో మొహల్లా క్లినిక్, ప్రతి జిల్లాకు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు
 • స్వామినాథన్ నివేదిక ప్రకారం రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వటం.
 • ఢిల్లీ ప్రజలు చాలా ఏళ్లుగా అన్యాయానికి గురవుతున్నారు. మేము అంతం చేస్తాము. ఢిల్లీ ప్రజలకు రాష్ట్ర హోదా  పొందుతారు.
 • ఐదేళ్లలో ఈ గ్యారంటీలు అమలుచేస్తాం

ప్రధాని మోదీ కేజ్రీవాల్‌ను జైలులో పెట్టారు: సునీతా కేజ్రీవాల్‌

 • రాంలీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ 
 • లోక్‌తత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) ర్యాలీ
 • ర్యాలీ పాల్గొన్న సీఎం కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌
 • సీఎం కేజ్రీవాల్‌ పంపిన లేఖలను చదివి వినిపించిన సునీతా కేజ్రీవాల్‌
 • ప్రధాని మోదీ కేజ్రీవాల్‌ను జైలులో పెట్టారు
 • మోదీ చేసింది సరైన పనేనా?
 • సీఎం కేజ్రీవాల్‌ నిజాయితిపరుడని మీరు నమ్మటం లేదా?
 • కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా?
 • మీ కేజ్రీవాల్‌ సింహం లాంటి వ్యక్తి
 • కోట్ల మంది హృదయాల్లో కేజ్రీవాల్‌ ఉన్నారు

రాంలీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ

 • పాల్గొన్న సీఎం కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌
 • అరవింద్‌ కేజ్రీవాల్‌ పంపిన లేఖ చదివి వినిపించిన సునీతా కేజ్రీవాల్‌
 • దేశం బాధలో ఉందని కేజ్రీవాల్‌ లేఖలో పేర్కొన్నారు.

‘ఇండియా కూటమి’మహా ర్యాలీ.. కాంగ్రెస్‌ ‌నేత కేసీ వేణుగోపాల్‌ కామెంట్లు

 • కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని రాజకీయ పార్టీలకు కనీస గౌరవం ఇవ్వడాన్ని పూర్తిగా నిరాకరిస్తోంది
 • ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల విషయంలో మరీ దారుణం
 • ఇలాంటి తరుణంలో లోక్‌సభ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయని ఎలా  నమ్ముతాం?
 • దేశంలో ఎన్నికలను బీజేపీ హైజాక్‌ చేయాలనుకుంటోంది
 • ప్రతిపక్షపార్టీలు, నేతలను బీజేపీ టార్గెట్‌ చేస్తోంది
 • అందుకే  బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీని నిర్వహిస్తోంది
   

‘ఇండియా కూటమి’ మెగా  ర్యాలీలో పాల్గొనేందుకు అరవింద్‌ కేజీవాల్‌ సతీమణి సునితా కేజ్రీవాల్‌ రాంలీలా మైదానానికి బయల్దేరారు.

రాజ్యాంగం దాడికి గురవుతోందని కాంగెస్‌ నేత సుప్రియా శ్రీనతే అన్నారు. రాంలీలా మైదనంలోని మెగా  ర్యాలీ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ రాజ్యాంగం దాడికి గురవుతోంది. దేశం మొత్తం రాజ్యాంగ రక్షణకు కలిసికట్టుగా ముందుకువెళ్తోంది. ఇదే విషయాన్ని విషయాన్ని తెలియజేయటానికి  ర్యాలీకి హాజరవుతున్నా’ అని అన్నారు.

నియంత, మతతత్వ బీజేపీ పార్టీ విధానాలను ఎండకట్టేందుకు, అరవింద్‌ కేజ్రీవాల్‌, హెమంత్‌ సోరెన్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో మహా ర్యాలీలో ప్రజలు. నేతలు పాల్గొంటున్నారని సీఐఎం(ఎం) నేత బృందా కారత్‌ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఉపా చట్టాన్ని ఈడీ, సీబీ దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం సమర్థమంతమైనది కాదనడానికి ఇదే నిదర్శనం అన్నారు.

 • ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’ చేపట్టిన మెగా ర్యాలీలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రవాల్‌ మాట్లాడనున్నారు.
 • రాంలీలా మైదానానికి కూటమి నేతలు చేరుకుంటున్నారు.
 • భారీ సంఖ్యలో ఢిల్లీ ప్రజలు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు చేరుకున్నారు.

ఢిల్లీ ప్రజల కోసమే కేజ్రీవాల్‌ ఆందోళన..
రాంలీలా మైదనం వద్దకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారని ఢిల్లీ మంత్రి ఆతిశీ అన్నారు. ఆమె మీడియా మాట్లాడారు.  ‘ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు నిరసనగా దేశంలోని అన్ని  ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ప్రజల జీవితాలను మార్చారని వారికి తెలుసు. ఆయన అరెస్ట్‌ అయ్యాక కూడా ఢిల్లీ ప్రజల కోసం ఆందోళన  పడుతున్నారు’అని మంత్రి అతిశీ అన్నారు. 

ఇండియా కూటమి మెగా ర్యాలీ

 • అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు నిరసనగా రాంలీలా మైదానంలో మహా ధర్నా
 • కేజీవాల్‌ జైల్‌లో ఉన్న ఫొటోలు ఏర్పాటు
 • ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా 13 పార్టీల నేతల హాజరు
 • ఎండ వేడిమి తట్టుకోవడానికి ఏర్పాట్లు
 • మెగా ర్యాలీ వద్ద భారీ భద్రత ఏర్పాటు

ప్రశ్నిస్తే జైల్‌లో వేస్తున్నారు
నకిలీ దర్యాప్తు పేరుతో, మన్నల్ని, మా పార్టీని  గత రెండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ టార్గెట్‌ చేసిందని ఆప్‌ జాతీయ అధికప్రతినిధి ప్రియాంకా కక్కర్‌ అన్నారు. రామ్‌లీలా మైదానంలో విపక్షాల ఇండియా కూటమి ర్యాలీ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎటువంటి అధారాలు లేకుండా  కొందరి నకిలీ ప్రకటనలతో సిట్టింగ్‌ సీఎంను అరెస్ట్‌ చేశారు. ఇది మా  పార్టీ గొంతు నొక్కాలనే కుట్రలో భాగం. ఎవరైలే బీజేపీ ప్రశ్నిస్తారే వాళ్లను జైల్‌లో  తోయటమే వారి పని’అని  ప్రియాంకా మండిపడ్డారు.


  

►ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ , కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి ఇండియా కూటమి రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు.

►రామ్‌లీల మైదానంలో కళ్లకు గంతులు కట్టుకుని కాంగ్రెస్‌ నేతల నిరసన


 

►ఇండియా కూటమి ర్యాలీకి బయలుదేరిన జార్ఖండ్‌ సీఎం చంపై సోరెన్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియంతృత్వానికి స్వస్థి పలికి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని అన్నారు. 

#WATCH | Ranchi: Before leaving for Delhi to attend the INDIA Alliance Maha Rally at the Ramlila Maidan today, Jharkhand CM Champai Soren says, "We have to abolish the dictatorship and save the democracy..." pic.twitter.com/kOHI9A0EiV

— ANI (@ANI) March 31, 2024

►ఈ ర్యాలీకి కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా కేజ్రీవాల్‌ అరెస్ట్‌ , కాంగ్రెస్‌ బ్యాంక్‌ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్‌ చేయడంపై ఇండియా కూటమి భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పన్ను ఎగవేత కేసులో రూ.1800 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్‌ నేతలు భగ్గుమంటున్నారు.

#WATCH | Delhi: INDIA alliance to hold rally against the arrest of Delhi CM and AAP convener Arvind Kejriwal, at Ramlila Maidan from 10 am today

(Visuals from the Ramlila Maidan) pic.twitter.com/cahR183k7g

— ANI (@ANI) March 31, 2024

కీలక నేతలు హాజరు..
►ఢిల్లీలో జరిగే ర్యాలీలో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోసియా గాంధీ, రాహుల్‌గాంధీ సహా కీలకనేతల పాల్గొనబోతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని మండిపడుతున్నాయి విపక్షాలు. ఇవాళ్టి ర్యాలీలో ఇదే అంశాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లనున్నారు నేతలు. ఇవాళ్టి కార్యక్రమాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీ జనసమీకరణ చేసి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. డెరిక్‌ ఒబ్రియాన్‌ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ), శరద్‌ పవార్‌ (ఎన్సీపీ–ఎస్‌సీపీ), తేజస్వీ యాద వ్‌ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. 

సునీత కేజ్రీవాల్‌కు కల్పన సొరేన్‌ సంఘీభావం
►ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సతీమణి సునీత కేజ్రీవాల్‌కు జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌ సతీమణి కల్పన సొరేన్‌ శనివారం సంఘీభావం తెలిపారు. కేజ్రీవాల్‌ నివాసంలో వీరి భే టీ జరిగింది.శక్తిమంతులైన మహిళలు కలవడంతో బీజేపీ భయపడి ఉం టుందని.. వీరిద్దరి సమావేశంపై ఢిల్లీ మంత్రి ఆతీశి ట్వీట్‌ చేశా రు. కల్పన విలేకర్లతో మాట్లాడుతూ, సునీత కేజ్రీవాల్‌కు యావత్తు జార్ఖం డ్‌ ప్రజలు అండగా ఉంటారని, తాము ఒకరి ఆవేదనను మరొకరం పంచుకున్నామని చెప్పారు.తాము కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించామన్నారు.

Advertisement
 
Advertisement