విమానాశ్రయంలో ఊసరవెల్లి, కోతులు స్వాధీనం

Animal Smuggling Gang Caught in Tamil nadu Airport - Sakshi

చెన్నై,అన్నానగర్‌: థాయ్‌ల్యాండ్‌ నుంచి చెన్నైకి బుధవారం విమానంలో అక్రమంగా తీసుకొచ్చిన కోతులు, ఉడత, తొండలను విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని థాయ్‌ల్యాండ్‌ దేశానికి తిరిగి పంపించడానికి అధికారులు చర్యలు తీస్తున్నారు. చెన్నై మీనమ్‌బాక్కమ్‌ విమానాశ్రయానికి బుధవారం థాయ్‌ల్యాండ్‌ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణం చేసిన చెన్నైకి చెందిన సురేష్‌ (28) మీద అనుమానం చెందిన విమానాశ్రయ అధికారులు విచారణ చేపట్టారు. అతను పొంతనలేని సమాధానం చెప్పడంతో అతని లగేజ్‌ని పరిశీలించారు. అందులో ఉన్న నాలుగు ప్లాస్టిక్‌ పెట్టెలను విప్పి చూడగా అమెరికా దేశాలలో నివసించే 12 ఊసరవెల్లులు, తొండలు, రెండు చిన్న కోతులు, థాయ్‌ల్యాండ్, మలేషియా దేశాలలో నివసించే రెండు జాతుల ఉడతలు ఉన్నాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని థాయ్‌ల్యాండ్‌ దేశానికి తిరిగి పంపించడానికి చర్యలు తీసున్నారు. .

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top