అమృతా ఫడ్నవిస్‌పై నెటిజన్ల మండిపాటు!

Amruta Fadnavis Calls PM Modi Father Of Our Country Twitter Response Differently - Sakshi

ముంబై : ప్రధాని నరేంద్ర మోదీని.. ‘ఫాదర్‌ ఆఫ్‌ కంట్రీ’గా సంభోందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ భార్య అమృతా ఫడ్నవిస్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. మన జాతి పిత మహాత్మా గాంధీ అని.. ఆ విషయాన్ని కాస్త గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. అసలు విషయమేమిటంటే... మంగళవారం మోదీ 69వ పుట్టిన రోజు సందర్భంగా అమృత సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు...‘ ఫాదర్ ఆఫ్‌ కంట్రీ నరేంద్ర మోదీ జీకి జన్మదిన శుభాకాంక్షలు. సమాజాన్ని మెరుగుపరిచే క్రమంలో నిర్విరామంగా కృషి చేసేందుకు స్ఫూర్తినిస్తున్న వ్యక్తి ఆయన’ అని ఆమె ట్వీట్‌ చేశారు. విషెస్‌తో పాటు తాను స్టేజీపై గాన ప్రదర్శన ఇస్తున్న వీడియోను కూడా అమృత జతచేశారు.

ఈ క్రమంలో అమృత ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు...‘ మన జాతి పిత మహాత్మా గాంధీ అని తెలుసు. ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోదీ దేశానికి తండ్రి అయ్యారా. ఇది ఎప్పుడు జరిగింది? ఓహో దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం పెరగడం, ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, ఆర్థిక మాంద్యం.. బహుశా ఇదేనేమో సమాజాన్ని మెరుగుపరచటం అంటే’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా 2016లో నేపథ్య గాయనిగా రంగ ప్రవేశం చేసిన అమృత పలు గీతాలు ఆలపించి సింగర్‌గా గుర్తింపు పొందారు. అదే విధంగా సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. ఇక అమృత నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడం ఇదే మొదటిసారి కాదు. గత అక్టోబరులో క్రూయిజ్‌ షిప్‌ అంచున కూర్చుని సెల్ఫీలకు ఫోజులిచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇందుకు ఆమె క్షమాపణలు కూడా కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top