లిఫ్టులో చిక్కుకున్న సీఎం, ఆయన భార్య | Akhilesh and his wife get stuck in assembly lift | Sakshi
Sakshi News home page

లిఫ్టులో చిక్కుకున్న సీఎం, ఆయన భార్య

Dec 18 2015 7:00 PM | Updated on Aug 17 2018 7:32 PM

లిఫ్టులో చిక్కుకున్న సీఎం, ఆయన భార్య - Sakshi

లిఫ్టులో చిక్కుకున్న సీఎం, ఆయన భార్య

అసెంబ్లీలో అత్యంత భద్రత మధ్య ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, అతని భార్య డింపుల్ యాదవ్ శుక్రవారం లిఫ్టులో ఇరుక్కున్నారు.

లక్నో: అసెంబ్లీలో అత్యంత భద్రత మధ్య ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, అతని భార్య డింపుల్ యాదవ్ శుక్రవారం లిఫ్టులో ఇరుక్కుపోయారు. విధాన సభ భవనంలో నిర్వహించిన బాల సంసద్(పిల్లల పార్లమెంట్) కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం  తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఊహించని పరిణామంతో పోలీసులు, భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

గ్రౌండ్ ఫ్లోర్లో ఎదురు చూస్తున్న ఉన్నతాధికారులు.. అఖిలేష్, డింపుల్ ఎంతకీ రాకపోవడంతో కంగారు పడి సెక్యురిటీని అప్రమత్తం చేశారు. చివరికి లిఫ్టు మధ్యలోనే ఆగిపోయిందని తెలుసుకుని హుటాహుటిన మరమ్మతు చర్యలు ప్రారంభించారు. సుమారు 20 నిమిషాల తరువాత వారిద్దరిని అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రికే చేదు అనుభవం ఎదురవడం చర్చనీయాంశం అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement