తొమ్మది నెలల గర్భిణీకి కరోనా పాజిటివ్‌

AIIMS Doctor Wife Nine Months Pregnant Corona Positive - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహ్మమారి కరోనా వైరస్‌ ఏ ఒక్కరినీ వదడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. అయితే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు కూడా వైరస్‌ సోకడం దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడుతో పాటు తొమ్మిది నెలల గర్భవతి అయిన తన భార్యకూ వైరస్‌ సోకింది. తొలుత వైద్యుడికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ముందస్తు జాగ్రత్తగా ఆయన భార్యకు వైద్యు పరీక్షలు నిర్వహించారు. దీంతో తొమ్మిది నెలల గర్భవతి అయిన ఆమెకు కూడా పాజిటివ్‌ అని తేలడంతో వైద్యులు అప్రమత్తం అయ్యారు. (500 కిమీ నడక.. హైదరాబాద్‌లో మృతి)

ఆమెకు డెలివరీ సమయం దగ్గర పడుతుండంతో ఎయిమ్స్‌లోని ప్రత్యేక వార్డుకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ఎలాంటి ముప్పులేదని వైద్యులు తెలిపారు. కాగా ఢిల్లీలో ఇప్పటికే ఆరుగురు వైద్యులకు కరోనా పాజిటివ్‌ను అని తేలిన విషయం తెలిసిందే. దీంతో వారందరినీ ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నాటికి కరోనా బాధితుల సంఖ్య రెండువేలకు దాటింది. మృతుల సంఖ్య 72 దాటింది. (ప్రధాని మోదీ వీడియో సందేశం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top