చెప్పుతో భర్త తాటతీసింది!

గ్వాలియర్: భర్త ఎలాంటి తప్పు చేసినా భరిస్తారో లేదో కానీ, ఇతర మహిళతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తే మాత్రం అపరకాళికలా మారిపోతారు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఇటీవల మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటుచేసుకుంది. ఇతర మహిళతో సంబధం పెట్టుకుంటావా అంటూ చేత చెప్పుతో రోడ్లపై భర్తను పరుగులు పెట్టించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. గ్వాలియర్ కు చెందిన పుష్ప, మనీశ్ అగర్వాల్ ప్రేమించుకున్నారు. పోలీసులు, కోర్టును ఆశ్రయించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లు అన్యోన్యంగా ఈ జంట కలిసి ఉన్నారు. కొన్ని నెలలుగా మనీశ్ వ్యవహారం పుష్ప ఆశించినట్లుగా ఉండటం లేదు. అసలు ఏమైందో తెలియదు కానీ, ఇంటికి రావడం తగ్గించాడు.
రెండు నెలలుగా మనీశ్ వ్యవహారాన్ని గమనించిన భార్యకు అనుమానమోచ్చింది. భర్త మనీశ్ కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకుంది. తన బంధువుల సాయంతో మనీశ్ ను పట్టుకుని, ఈ విషయంపై కడిగి పారేసింది. వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. చిన్నపిల్లల్లా వ్యవహరించవద్దని ఇంటికి వెళ్లి హాయిగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇదే అవకాశమని భావించిన మనీశ్, పుష్ప నుంచి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. మరోసారి రోడ్లపై భార్యాభర్తలు గొడవపడ్డారు. భర్తపై పుష్ప విరుచుకుపడి చెప్పుతో దాడికి ప్రయత్నించింది. మనీశ్ రోడ్లపై పరుగు అందుకోగానే చెప్పు చేతపట్టిన పుష్ప కూడా భర్తను తరుముతూ హల్ చల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి